రియల్‌లైఫ్‌లో మేనమామ, మేనల్లుడైన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో నటిస్తున్న చిత్రం `వెంకీమామ`. వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతుకి జంటగా రాశీఖన్నా నటిస్తున్న ఈ సినిమాకి కె.యస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `వెంకీమామ`కి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయ్యిందని, కేవలం ఒక పాట షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలిసింది. త్వరలోనే ఆ గీతాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా… దీపావళి కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాపై అక్కినేని, దగ్గుబాటి అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: