వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే గోవాలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళింది. యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #DiscoRaja is All set for shoot🎥 @ Iceland.#discorajaondec20th@RaviTeja_offl @NabhaNatesh @starlingpayal @vennelakishore @Tanyahopeoffl @Dir_Vi_Anand @MusicThaman #KartikGattamneni @itsRamTalluri @SRTmovies pic.twitter.com/duGVISWkwJ
— SRT Entertainments (@SRTmovies) September 18, 2019
ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ కి పనిచేసిన స్టంట్ మాస్టర్లు పనిచేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు నిముషాలు మాత్రమే ఉండే ఈ సీన్ కోసం 4–5 కోట్ల రూపాయలు బడ్జెట్ ను పెట్టనున్నారట. అంతే కాదు ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
కాగా ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ తో పాటు నాభా నటేష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఇంకా సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయినా రవితేజాకు మంచి సక్సెస్ వస్తుందేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























