సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా సాహో. ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ కు మాత్రం ఏమాత్రం ఢోకా లేదు. ఈ సినిమా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 కోట్ల షేర్ ను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ మాత్రం ఎప్పటికప్పుడు పోస్టర్ ద్వారా తెలియచేస్తున్నారు చిత్రయూనిట్. ఇక తాజాగా సాహో ఎంత కలెక్ట్ చేసిందో పోస్టర్ ద్వారా తెలియజేసారు. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్ను విడుదల చేసింది. ‘ఇంత కన్నా ఎక్కువ మీరు ఊహించగలరా’ అంటూ ట్వీట్ చేసింది.
Can you imagine anything getting bigger than this💥💥💥#Saaho crosses 400Cr+ at BOs worldwide
Book tickets here : https://t.co/3g8zydBuXu #SaahoInCinemas pic.twitter.com/hS0rk7pkAl
— UV Creations (@UV_Creations) September 9, 2019
నిజానికి తెలుగులో కంటే హిందీలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగా వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ వీక్ లో ‘సాహో’ రూ.370 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే ఇందులో బాలీవుడ్ నుంచే రూ.116 కోట్లు వచ్చాయి. 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే దానిలో రూ.130 కోట్లు బాలీవుడ్ నుంచి వచ్చాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























