మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 10వ తేదీ వైజాగ్ లో జరుగనుంది. గురజాడ కళాక్షేత్రం, ఉడా కాంప్లెక్స్, సిరిపురం సర్కిల్, వైజాగ్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది. జెర్సీ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత నాని నటించిన NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాని ప్రస్తుతం V మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























