‘అంధాధున్’… గత ఏడాది హిందీనాట కాసుల వర్షం కురిపించిన బాలీవుడ్ మూవీ. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ… పలు ప్రాంతీయ పురస్కారాలతో పాటు తాజాగా మూడు జాతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. అలాంటి నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని… తమిళంలో ప్రశాంత్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… తెలుగులోనూ ఈ సినిమాని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం… `అంధాధున్` తెలుగు రీమేక్ రైట్స్‌ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఫ్యాన్సీ రేట్‌తో సొంతం చేసుకున్నారని తెలిసింది. అంతేకాదు… హిందీ వెర్షన్‌ని నిర్మించిన వయాకాం 18 మోషన్ పిక్చర్స్ కూడా భాగస్వామ్యం వహిస్తుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం… నితిన్ నటిస్తున్న ‘భీష్మ’, ‘రంగ్ దే’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే చంద్రశేఖర్ యేలేటి సినిమా కూడా నిర్మాణ దశలో ఉంది. ఈ మూడు చిత్రాలు పూర్తైన వెంటనే అంటే వచ్చే ఏడాది ఆరంభంలో ‘అంధాధున్’ సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























