గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా అల .. వైకుంఠపురములో .. మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. టబు, జయరామ్, నివేత పెత్తురాజ్, సుశాంత్, నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల .. వైకుంఠపురములో .. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు (సెప్టెంబర్ 1వ తేదీ )ఉదయం 9గంటలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ దసరా పండుగ కు ప్రారంభం కానుందని సమాచారం. ఆ మూవీ కాకుండా ఐకాన్ మూవీ కి అల్లు అర్జున్ కమిట్ అయిన విషయం తెలిసిందే. అల .. వైకుంఠపురములో .. మూవీ నిరవధికంగా షూటింగ్ జరుపుకొంటుంది. చాలా కాలం గ్యాప్ తరువాత అల్లు అర్జున్ నటించిన మూవీ కావటం, పాజిటివ్ వైబ్రేషన్స్ తో టైటిల్ ఉన్న అల .. వైకుంఠపురములో .. మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























