తెలుగుతో పాటు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తాప్సీ. ఇటీవలే మిషన్ మంగళ్ సినిమాతో హిందీలో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది తాప్సీ. ప్రస్తుతం తను ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తుషార్ హీరానందని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితోపాటు ఆకర్ష్ ఖురాన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో గుజరాత్ అథ్లెట్ రష్మీ బయోపిక్ చేస్తుంది. ‘రష్మీ ద రాకెట్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఈ సినిమాలో తాప్సీ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ రాకెట్ మరో మిషన్ కు సిద్ధమైంది.. ట్రాక్ పై పరుగులు తీస్తోంది..అంటూ ఫోటో షేర్ చేసాడు’. ఇక ఈ చిత్రానికి రోనీ స్క్రూవాల్లా నిర్మాత.
Fierce, strong-headed and unstoppable, meet #RashmiRocket! @MrAkvarious @RonnieScrewvala @RSVPMovies @iammangopeople #NehaAnand #PranjalKhandhdiya pic.twitter.com/WUKEIWVoL8
— taapsee pannu (@taapsee) August 30, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























