శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అడ్డంకులన్నింటినీ తొలగించుకున్న దర్శక నిర్మాతలు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్ట్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో కమల్, కాజల్ పాల్గొంటారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, ప్రియా భవాని శంకర్ లు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాఅనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ రవి వర్మన్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: