బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన `పింక్` (అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులు) చిత్రాన్ని… తమిళంలో `నేర్‌కొండ పార్‌వై` పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అజిత్, విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా… ఈ కోర్ట్ డ్రామాని తెలుగులోనూ రీమేక్ చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌లో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తాడని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. అంతేకాదు… తెలుగు వెర్షన్‌ని ప్రముఖ నిర్మాత `దిల్` రాజుతో పాటు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తాడని టాక్. అలాగే… ఈ చిత్రానికి `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. త్వరలోనే `పింక్` తెలుగు రీమేక్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=lH_azWTGozc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























