`వీడొక్కడే`, `బ్రదర్స్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమా `బందో బస్త్`. తమిళంలో `కాప్పాన్` పేరుతో రూపొందిన ఈ అనువాద చిత్రంలో మలయాళ నటుడు మోహన్‌లాల్‌తో పాటు ఆర్య, సాయేషా సైగల్, బొమన్ ఇరాని కీలక పాత్రల్లో నటించారు. హేరిస్ జైరాజ్ సంగీతమందించిన ఈ సినిమాని తొలుత ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆగస్టు 30కి వాయిదా వేశారు. కాగా… లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాని మరో మూడు వారాల పాటు వాయిదా వేశారని తెలిసింది. అంటే… సెప్టెంబర్ 20కి ఈ సినిమా విడుదల తేదిని ఫిక్స్ చేశారని టాక్. త్వరలోనే విడుదల తేదిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=g9vggctdK-s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























