పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌లా నిలచిన చిత్రం `తొలిప్రేమ`. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు ఎ.కరుణాకరన్ డైరెక్టర్‌గా తొలి అడుగులు వేశాడు. పవన్‌కి జోడీగా కీర్తి రెడ్డి నటించిన ఈ చిత్రంలో… వాసుకి, సంగీత, నర్రా వెంకటేశ్వరరావు, నగేష్, అచ్యుత్, అలీ, వేణుమాధవ్, పీజే శర్మ, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీత రచన చేసిన పాటలకు… దేవా అద్భుతమైన స్వరాలు సమకూర్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గగనానికి ఉదయం ఒకటే”, “ఈ మనసే”, “ఏమైందో ఏమో”, “ఏమి సోదరా”, “రొమాన్స్” … ఇలా ఈ సినిమాలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా… `గగనానికి` పాట కోసం తీర్చిదిద్దిన తాజ్ మహల్ సెట్ ఆ రోజుల్లో చర్చనీయాంశమయ్యింది. ఎస్.ఎస్.సి.ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ‘తొలిప్రేమ’ పలు నంది అవార్డులతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. 1998 జూలై 24న విడుదలైన ‘తొలిప్రేమ’… నేటితో 21 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[youtube_video videoid=_phcQ0DrIVM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























