మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండగా… రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. పిరియాడికల్ టచ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంతేకాదు… ఒక పాత్ర కోసం డిస్కో డాన్సర్‌గా సందడి చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ అన్నపూర్ణ ఏడెకరాలలో రూ.1.2 కోట్లతో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. అక్కడ రవితేజ, తాన్యా హోప్, `వెన్నెల` కిషోర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 26 వరకు ఈ షెడ్యూల్ సాగుతుంది. అనంతరం ఆగస్టు మొదటి వారం నుంచి ఢిల్లీలో `డిస్కో రాజా` నెక్ట్స్ షెడ్యూల్ జరుగనుంది. ఈ షెడ్యూల్ లో `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్ కూడా జాయిన్ కానుంది. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి… ఈ ఏడాది చివరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
[youtube_video videoid=otdGhg81P4M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: