‘సరైనోడు’(2016)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను… మూడేళ్ల విరామం తరువాత మరోసారి జట్టుకట్టనున్నారు. ఈ సారి కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ద్వయం… నాటి ‘సరైనోడు’ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోందట. కాగా… గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం బన్నీ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఐకాన్’ లోనూ, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఓ డిఫరెంట్ లవ్ స్టోరీలోనూ బన్నీ కథానాయకుడిగా నటించనున్నాడు. వీటితో పాటు ఇప్పుడు బోయపాటి చిత్రం కూడా తోడవడంతో… బన్నీ క్రేజీ లైనప్ ప్రస్తుతం టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.
[youtube_video videoid=fCi_c7tZnC0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: