విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ… ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్… చిత్రీకరణ పరంగా తుది దశకు చేరుకుందని సమాచారం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం… ఈ సినిమాకి సంబందించి ప్యాచ్ వర్క్ మినహా దాదాపుగా చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. కాగా… ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=hd7MmQ3f2Pc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: