ఎస్.ఎస్.రాజమౌళి… తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన అగ్రశ్రేణి దర్శకుడు. తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం:1’ నుంచి గత చిత్రం ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వరకు ఈ దర్శకధీరుడు తెరకెక్కించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ బాట పట్టడం విశేషం. వాటిలో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ‘ఈగ’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, సక్సెస్ఫుల్ హీరోయిన్ సమంత , కన్నడ నటుడు ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఆదిత్య, తాగుబోతు రమేష్, శ్రీనివాస రెడ్డి, దేవదర్శిని, హంసానందిని తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వరవాణి కీరవాణి బాణీలు సమకూర్చిన ఈ చిత్రం…. పలు ప్రాంతీయ, జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా… తమిళంలో `నాన్ ఈ` పేరుతో విడుదలై అక్కడా విజయకేతనం ఎగరవేసింది. 2012 జూలై 6న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచిన ‘ఈగ’… నేటితో ఏడు వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
[youtube_video videoid=4lrDhwoYkmY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: