క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ… తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్ది మంది దర్శకులలో ఒకరు. కుటుంబ కథా చిత్రాలతో పాటు అందమైన ప్రేమకథలనూ మనసుకు హత్తుకునేలా రూపొందించగల ఈ దర్శకుడికి… గత కొంత కాలంగా ఆశించిన విజయం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రుద్రాక్ష’ను తెరకెక్కించే పనిలో ఉన్నాడట వంశీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… చాలా కాలం క్రితమే హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ సబ్జెక్ట్‌ను రూపొందించాలనే ఆలోచనతో ‘రుద్రాక్ష’ అనే మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్‌ను రాసుకున్నాడట కృష్ణవంశీ. ఇప్పుడు ఆ సినిమానే సదరు క్రియేటివ్ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. గతంలో వంశీతో ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్ ఈ హారర్ మూవీని కూడా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు గంట సేపు సాగే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని సమాచారం. అలాగే, ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం ఓ అగ్ర కథానాయికను ఎంపిక చేసే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నట్టు టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
[youtube_video videoid=bdEna7_pg-o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: