‘మహర్షి’ ఫార్ములాతో మ‌హేష్‌26?

Mahesh Babu Turns Unique Producer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu to Co Produce Mahesh 26,Mahesh Babu Becomes as a Film Producer,Mahesh Babu as a Producer in His Next Movie
Mahesh Babu to Co Produce Mahesh 26

‘మహర్షి’తో కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్‌ని అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. క‌థానాయ‌కుడిగా మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా… కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో… ఈ చిత్రానికి వర్కవుట్ అయిన ఫార్ములానే తన అప్ కమింగ్ మూవీకి కూడా ఫాలో కానున్నాడ‌ట‌ మహేష్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే…‘మహర్షి’ని అగ్ర నిర్మాత అశ్వనీదత్, ‘దిల్’ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇలా ముగ్గురు నిర్మాత‌లు, మూడు నిర్మాణ సంస్థ‌లు… మ‌హేష్ చిత్రాన్ని నిర్మించ‌డం ఇదే తొలిసారి. ఈ ఫార్ములా వ‌ర్క‌వుట్ కావ‌డంతో… ఇప్పుడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు కూడా ఇదే ఫార్ములాను పాటిస్తున్నాడట‌ మహేష్. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు… వీరితో పాటు మహేష్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇదివ‌ర‌కు ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు ఓ నిర్మాతగా వ్యవహరించిన మ‌హేష్‌… ముచ్చ‌ట‌గా మూడోసారి త‌న కొత్త చిత్రం కోసం నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌డుతుండ‌డం విశేషం.

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో మ‌హేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండ‌గా… విజయశాంతి, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న‌ ఈ చిత్రం… జూలై 26 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుందని స‌మాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’, రెడ్డిగారి అబ్బాయి వంటి టైటిల్స్‌ ప‌రిశీలిన‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=tP0nWFWPcc8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.