స‌మంత సంద‌డే సంద‌డి

Samantha Upcoming Movies Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha Next Film Updates,Samantha New Movie News,Samantha Gets Busy With Crazy Projects,Interesting Updates on Samantha Upcoming Movies
Samantha Upcoming Movies Latest Update

సమంత… టాలీవుడ్‌లో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కథానాయిక. కెరీర్ ఆరంభం నుంచి ఏడాదికో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్న‌ ఈ చెన్నై బ్యూటీ… ఈ సంవ‌త్స‌రం కూడా ‘మజిలీ’ రూపంలో ఇప్ప‌టికే ఓ విజయాన్ని న‌మోదు చేసుకుంది. ఇదే జోష్‌లో… ఈ ఏడాది ద్వితీయార్ధంలో మ‌రో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ఈ మూడు సినిమాలు కూడా వరుసగా మూడు నెలల్లో విడుదల కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… జూలై నెలలో సమంత ప్రధాన పాత్రలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ ‘ఓ బేబీ’ విడుదల కానుంది. అలాగే… కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న‌ ‘మన్మథుడు 2’లో సామ్ అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక సెప్టెంబర్‌లో శర్వానంద్, సమంత నాయకానాయికలుగా నటించిన తమిళ రీమేక్ చిత్రం ‘96’ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.మొత్త‌మ్మీద‌… మూడు వ‌రుస నెల‌ల్లో సామ్ చిత్రాలు నెల‌కో సినిమా అన్న చందంగా సంద‌డి చేయ‌నున్నాయ‌న్న‌మాట‌.

[subscribe]

[youtube_video videoid=ewiUpOurOvU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.