మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మజిలీ మూవీ ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఘన విజయం సాధించింది. నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో మొదటి స్థానం సొంతం చేసుకొని భారీ వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే అనుకున్న టార్గెట్ ను రీచ్ అయిన మజిలీ కలెక్షన్స్.. థియేటర్లలో వేరే సినిమాలు కూడా లేకపోవడంతో ముందు ముందు కూడా మంచి వసూళ్లను రాబట్టి మంచి లాభలను తెచ్చి పెడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈనేపథ్యంలోనే ఇప్పటికే చాలా ఏరియాల్లో మజిలీ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక కృష్ణా జిల్లాలో ఈ చిత్రం ఐదోవ రోజుకు గానూ రూ .10.12 లక్షల షేర్ ను రాబట్టి.. మొత్తం ఐదు రోజులుకు గానూ 1.22 కోట్ల షేర్ ను రాబట్టింది.
మొత్తానికి చైతు, సామ్ కి మజిలీతో మంచి హిట్ రావడం, దానికి తోడు సినిమాలో చైతు నటన సినిమాకే హైలెట్ నిలవడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగా షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఇంకా రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
కృష్ణ మజిలీ 4 డే షేర్ -12,21,664
టోటల్ షేర్ – 1,12,39,664
కృష్ణ మజిలీ 5 డే షేర్ – 10,12,312
టోటల్ షేర్ – 1,22,63,314
[subscribe]
[youtube_video videoid=msJBVpEm2ZE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























