ఒకే నెలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజవడం అప్పుడప్పుడు చోటుచేసుకునే వ్యవహారమే. అలా ఈ ఏడాది ఆగస్టు నెలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు తమిళనాట సందడి చేయనున్నాయి. ఆ హీరోలు మరెవరో కాదు… అజిత్, సూర్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `విశ్వాసం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అజిత్ నటిస్తున్న చిత్రం `నేర్కొండ పార్వై` (`పింక్` రీమేక్) ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా…. ఆ సినిమా విడుదలైన మూడు వారాలకి `వీడొక్కడే`, `బ్రదర్స్` చిత్రాల తరువాత కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న `కాప్పాన్` చిత్రం ఆగస్టు 30న రిలీజ్ కాబోతోంది. మరి.. ఒకే నెలలో మూడు వారాల గ్యాప్లో రాబోతున్న ఈ రెండు స్టార్ హీరోల చిత్రాల్లో ఏ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అన్నట్టు… ఈ రెండు చిత్రాలూ తెలుగులోనూ అనువాదవయ్యే అవకాశం లేకపోలేదు.
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























