జంగా గ్లింప్స్ అదుర్స్.. రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో సినిమాపై భారీ అంచనాలు

Jangaa Glimpse Promises Raw and Rustic Action

ప్రస్తుతం బిగ్ బాస్ 10లో టాప్ కంటెస్టెంట్ లలో ఒకరిగా కొనసాగుతున్న యువ హీరో త్రిగుణ్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జంగా’. ఈసినిమానుండి మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది.కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వంలో ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా పఠాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కొన్ని లక్షల ఏండ్లు పట్టింది పశువు మనిషి అవ్వడానికి” అనే పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. శ్మశానంలో చితి మంటల మధ్య నోట్లో మందు బాటిల్‌తో త్రిగుణ్ కనిపించిన తీరు, ఆయన మాస్ అండ్ వైల్డ్ యాటిట్యూడ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చాయి. ఇప్పటివరకు లవర్ బాయ్ లేదా సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన త్రిగుణ్, ఈ చిత్రంలో పూర్తిగా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్‌లో అదరగొట్టబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది.

వెంకట్ సి. దిలీప్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు అత్యంత రిచ్ అండ్ రస్టిక్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇక కృష్ణ సౌరభ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచి, రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని ఇస్తోంది. ఉన్నతమైన నిర్మాణ విలువలు, దర్శకుడు కెవిన్ గడ్డం టేకింగ్ స్టైల్ చూస్తుంటే ‘జంగా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.