దాదా విడుదల డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Makers Put an End to Confusion Over Dada Release Date

నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘దాదా’ . గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఆ వార్తలన్నింటికీ చిత్రబృందం పక్కా క్లారిటీతో చెక్ పెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా విడుదల వాయిదా పడే ప్రసక్తే లేదని, అనుకున్న సమయానికే అంటే డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా నందమూరి బాలకృష్ణ థియేటర్ల బరిలోకి దిగుతున్నారని మేకర్స్ స్పష్టం చేశారు. ఇటీవల ఎదురైన చిన్నపాటి గాయాన్ని సైతం లెక్కచేయకుండా బాలయ్య చూపించిన డెడికేషన్ మరియు కట్టుబాటుతో షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం శరవేగంగా ఎడిటింగ్, డబ్బింగ్ పనులను జరుపుకుంటున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణను కేవలం రొటీన్ మాస్ హీరోగానే కాకుండా, ఎంతో గాంభీర్యం మరియు క్యారెక్టర్ డెప్త్ ఉన్న పవర్‌ఫుల్ మెచ్యూర్డ్ మాఫియా డాన్ లుక్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 24న ‘దాదా’ థియేటర్లలోకి రావడం ఖరారు కావడంతో, క్రిస్మస్ బరిలో బాక్సాఫీస్ వద్ద బాలయ్య మాస్ జాతర ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అతి త్వరలో ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.