కింగ్ 100 … టబు గ్లింప్స్ రేపే

Tabu's glimpse from #King100 out on November 4th at 9 AM

కింగ్ నాగార్జున అక్కినేని నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’. ఆర్‌. ఏ. కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ మరియు టీ-సిరీస్ సౌత్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మైలురాయి చిత్రంపై అక్కినేని అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రాజెక్ట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన అతిపెద్ద హైలైట్ ఏంటంటే..నాగార్జున, సీనియర్ కథానాయిక టబు దాదాపు 28 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటం. గతంలో ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి కల్ట్ హిట్లతో అలరించిన ఈ ఐకానిక్ జోడీ మళ్లీ తెరపైకి రాబోతుండటంతో సరికొత్త క్రేజ్ నెలకొంది.

తాజాగా ఈ సినిమా నుంచి టబు పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. టబు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 4న ఉదయం 9 గంటలకు ఈ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రకటన కోసం వదిలిన చిన్న ప్రమోషనల్ వీడియోలో ఓ పాతకాలపు రేడియో, చీరకట్టులో ఉన్న టబు బ్యాక్ లుక్ విజువల్స్ చూపించగా, ప్రధానంగా “దిస్ టైమ్.. ఇట్స్ నాట్ లవ్” (ఈసారి ఇది ప్రేమ కాదు) అని ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నాగ్-టబు జోడీ అనగానే లవ్ అండ్ రొమాన్స్ గుర్తుకొచ్చే ప్రేక్షకులకు, ఈసారి ప్రేమ కాకుండా వీరిద్దరి మధ్య ఏదో బలమైన వైరం లేదా డిఫరెంట్ ఎమోషన్‌ను చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.

దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 4న రాబోయే టబు గ్లింప్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.