సూపర్ రన్ టైంతో వస్తున్న సూర్య సీన్

Suriya’s Scene Comes with an Impressive Runtime

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, సెన్సేషనల్ డైరెక్టర్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘సీన్’ . 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జ్యోతిక – సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేయగా, సినిమా నిడివిని 2 గంటల 29 నిమిషాలు (149 నిమిషాలు) గా లాక్ చేశారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌కు ఇది పర్‌ఫెక్ట్ అండ్ షార్ప్ రన్‌టైమ్ అని, ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమా రూపుదిద్దుకుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సూర్య డిఎస్పి ప్రేమ్‌రాజ్‌గా సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, నజ్రియా నజీమ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుషిన్ శ్యామ్ అందించిన హై-వోల్టేజ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.