భారీ ధరకు వృషకర్మ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న దిల్ రాజు

Dil Raju Acquires Vrushakarma Theatrical Rights for a Huge Price

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మైథాలజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ . ‘విరూపాక్ష’తో ట్రెండ్ సెట్టింగ్ విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ అపారమైన క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ రిలీజ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా ప్రముఖ నిర్మాణ-ప్రాంతీయ పంపిణీ సంస్థ SVC రిలీజ్ ద్వారా ఈ చిత్రం ఎంతో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు ఇంతవరకు చూడని ఒక విజువల్ వండర్ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భారీ ధరకు దిల్ రాజు ఈ హక్కులను దక్కించుకున్నారు.ఇండస్ట్రీ సర్కిల్ లో సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది.

శ్రీ వెంకటేశ్వర చలనచిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కంతార ఫేమ్ అజనీష్ బి లోకనాథ్ మ్యూజిక్, రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ మరియు నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో సెన్సేషనల్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.