ఆదిత్య మూవీస్ సమర్పణ లో సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రోడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రాజ్ వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్, ఫోక్ క్వీన్ నాగదుర్గ హీరో, హీరోయిన్ లుగా రాబోతున్న చిత్రం “శనార్తి ” రెగ్యులర్ షూట్ కరీంనగర్ జిల్లా వెలిచాల లో పూజ కార్యక్రమం తో ఘనంగా మొదలయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సంపత్ నంది, ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, ఇతర నటీనటులు పాల్గొన్నారు. సుమారు నెల పాటు వెలిచాల, గట్టు భూత్కూర్ లో జరగనుంది. ఈ చిత్ర దర్శకులు గణేష్ రాజ్ ఉప్పునూటి గంగాధర మండలం, గట్టు బూత్కూర్ చెందిన వారు కావడం విశేషం.
తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక మూలాల్ని గుర్తు చేసే ఈ చిత్రం ఒక మరిచిపోలేని మైలురాయి గా నిలవనుంది.
రచయితగా, కథకుడిగా, షోరన్నర్‌గా తనకున్న ప్రతిభతో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది ‘ఓదెల’ ఫ్రాంచైజీతో సహా విజయవంతమైన కథలు, ఫ్రాంచైజీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ‘శనార్తి’తో ఆయన అనుబంధం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది.
తన విలక్షణమైన సంగీతంతో శంసలు పొందిన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతపరంగా మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి డీవోపీ, బేబీ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: అఖిల్ రాజ్, నాగ దుర్గ, మురళీధర్ గౌడ్, సునందిని, సుంకర లక్ష్మి, రమేష్ నకిరికంటి, వైవా రెడ్డి, మై విలేజ్ షో రాజు, అంజి బాబు
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























