సూర్య సీన్ నుంచి ఫన్‌ఫుల్ సాంగ్ ఏరోప్లేన్ రిలీజ్

Aeroplane Song from Suriya’s Scene Is Out Now

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘ఏరోప్లేన్’ అదిరిపోయే ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన ఈ పాట ఆకట్టుకునే రిథమ్‌తో జోష్‌ను పెంచుతోంది. ముఖేష్ మహమ్మద్ ఎనర్జిటిక్ వోకల్స్, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ పాటకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సూర్య, నజ్రియా మధ్య ఫన్‌ఫుల్ కెమిస్ట్రీని అందంగా ప్రజెంట్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుశిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్‌.

‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.