విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ పాలన అణచివేత, కరవు పరిస్థితులను అద్భుతంగా ఆవిష్కరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ‘రణబాలి’ ట్రైలర్‌పై ప్రత్యేకంగా స్పందిస్తూ చిత్ర యూనిట్‌ను కొనియాడారు.
చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఇంతటి వీరోచిత పోరాటాన్ని, రాయలసీమ గడ్డపై బ్రిటిష్ పాలకులు సాగించిన అణచివేతను తెరపై అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించారని నారా లోకేష్ పేర్కొన్నారు. రాయలసీమ బిడ్డగా, రౌద్ర రూపం దాల్చిన యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉందని, ఆయనకు దీటుగా జయమ్మ పాత్రలో రష్మిక మందానా అభినయం సినిమాకు బలమైన పిల్లర్‌గా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ చరిత్రను కళ్లకు కట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ను అభినందిస్తూ, అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























