విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం (హౌస్ నెం. 47)’ విడుదల మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 9వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి రావడం లేదని మేకర్స్ అధికారికంగా స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాను మొదట అక్టోబర్ 2న (గాంధీ జయంతి కానుకగా) విడుదల చేయాలని భావించినప్పటికీ, అనంతరం అక్టోబర్ 9కి రీ-షెడ్యూల్ చేశారు. అక్టోబర్ 6న ట్రైలర్ లాంచ్, 7న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు, క్వాలిటీ చెెక్కింగ్ కారణంగా మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్రబృందం తెలిపింది.
“ప్రేక్షకులకు అత్యుత్తమ క్వాలిటీతో కూడిన వినోదాన్ని అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత. అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. వెంకీ-త్రివిక్రమ్ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ నిర్ణయం కొంత నిరాశ కలిగించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























