కాకా అలాంటిందేమి లేదు

Kakaa Makers Reconfirm the Release Date

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ చిత్ర విడుదలపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తాజాగా తెరపడింది. విశ్వంభర చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందనే వార్తల నేపథ్యంలో ‘కాకా’ సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ రూమర్స్‌ అన్నింటికీ చెక్ పెడుతూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పరిణామాల నేపథ్యంలో మేకర్స్ విడుదల చేసిన తాజా ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత కాకా నిర్మాత కేవీఎన్ అలాగే ‘విశ్వంభర’ నిర్మాత విక్రమ్ రెడ్డి కూడా కలిసి ఉండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

వీరిద్దరితో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చర్చించి, క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ‘కాకా’ సినిమాను అనుకున్న తేదీకే పక్కాగా దించుతున్నట్లు ఫైనల్ చేశారు. దీంతో సంక్రాంతి రేసులో సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.