విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చిత్రీకరణపూర్తి చేసుకుంది. దాదాపు 130 రోజుల పాటు సాగిన ఈ సినిమా మొత్తం షూటింగ్ ప్రక్రియను చిత్ర బృందం దిగ్విజయంగా పూర్తి చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
19వ శతాబ్దంలో (1854-1878) బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ పాన్-ఇండియా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. షూటింగ్ పూర్తవ్వడంతో ప్రస్తుతం చిత్ర బృందం పూర్తిస్థాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించింది.పెళ్లి తరువాత విజయ్ – రష్మిక కలిసి నటించిన సినిమాకావడంతో రణబాలిపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























