హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న త్రివిక్రమ్

Trivikram to Release Blockbuster Hindi Movie Hanuman Ansh in Telugu

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.కేవలం 2కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకు 150కోట్లపైనే వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మొదటి రోజు కేవలం 28లక్షల గ్రాస్ రాబట్టిన ఈసినిమా ఆ తరువాత రోజు రోజుకి ఊహించని రీతిలో కలెక్షన్స్ ను పెంచుకుంటూపోతూ 200కోట్ల మైలురాయికి చేరువైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మైమరిపించిన ఈ భక్తిరస దైవిక చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో సమర్పిస్తున్నారు.

ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్‌ ఈసినిమాను తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేస్తుంది. శోభినా సత్య, విహాన్ షెడ్గే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ప్రెసెంట్ చేస్తుండటంతో తెలుగులోనూ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.