సూర్య సీన్ టీజర్ రిలీజ్ … మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Suriya 47 Gets the Title Scene and a Release Date

తమిళ స్టార్ హీరో సూర్య 47వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ‘ఆవేశం’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన 1 నిమిషం 20 సెకన్ల టైటిల్ టీజర్‌లో సూర్య సరికొత్త మేకోవర్‌తో, విభిన్నమైన పోలీస్ ఆఫీసర్ ‘ఇన్బరాజ్’ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. షార్ట్ అండ్ టీ-షర్ట్‌లో స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తూ జైలులోని ఖైదీల మధ్య నడుచుకుంటూ వచ్చే సీన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. సుమారు 900 మంది క్రిమినల్స్‌ను జైల్లో పెట్టిన ఒక కాస్త తేడా ఉన్న ‘సైకో’ పోలీస్ ఆఫీసర్‌గా సూర్య క్యారెక్టరైజేషన్ ఉండబోతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది.

ఈ చిత్రంలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మలయాళ యువ నటుడు నస్లెన్ కే. గఫూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకి మలయాళ ప్రముఖ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.