శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ అధికారిక టీజర్ విడుదలైంది. ప్రముఖ రైటర్ , నిర్మాత కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట కృష్ణ కర్నాటి , సీత కర్నాటి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘కామ్రేడ్’ అనే పేరులోనే సీరియస్‌నెస్ ఉన్నప్పటికీ, ఈ కామ్రేడ్ కళ్యాణ్ ఏకైక ఎజెండా మాత్రం ప్రేక్షకులకు ‘LOL సలామ్’ (నవ్వులు పంచడం) అనడమేనని టీజర్ స్పష్టం చేస్తోంది. కమ్యూనిజం, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ను కామెడీగా మలిచి శ్రీవిష్ణు తనదైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో మరోసారి ఆకట్టుకున్నారు.శ్రీ విష్ణు మార్క్ కామెడీతో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు మంచి హైప్ ఇవ్వగా, శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ మరియు గెటప్స్ ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్’గా ఆయనను మరోసారి నిలబెట్టేలా ఉన్నాయి. నక్సలైట్ నేపథ్యానికి కామెడీ కోణాన్ని జోడించి తీర్చిదిద్దిన సన్నివేశాలు థియేటర్లలో నవ్వుల పండగ ఖాయమని చూపిస్తున్నాయి.సకల వినోదాల మేళవింపుగా రాబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























