కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Makers Give Clarity on Kaaka Release Date

బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కాకా’. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొత్త షూటింగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 7వ తేదీ నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ కీలకమైన సుదీర్ఘ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన నటీనటులపై అత్యంత ముఖ్యమైన, హై-వోల్టేజ్ సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వాయిదా పడుతుందంటూ రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఆ వార్తలపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ముందు చెప్పినట్లుగా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుందని మళ్లీ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి గారి మాస్ అండ్ ఎమోషనల్ అవతార్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.