హీరో సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వారాహి మాత వారణాసి గ్రామదేవతగా పూజలందుకుంటుందని, పరమశివుడి ఆజ్ఞతో మహేంద్రగిరిలో కొలువుదీరిన అమ్మవారిగా కథలో చూపించారు. 150 ఏళ్లుగా మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందినవారు వరుసగా మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, వరుస మరణాల వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో దైవశక్తినే ఎదుర్కొనే సాహసం చేస్తాడు.
ట్రైలర్ ద్వారా తొలిసారి కథలోని ప్రధాన అంశాన్ని మేకర్స్ రివీల్ చేశారు. భక్తి, విశ్వాసం, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించిన కథనం ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు దైవశక్తిపై విశ్వాసం, మరోవైపు ఆ నమ్మకం వెనుక ఉన్న నిజాన్ని అన్వేషించే ప్రయత్నం మధ్య సంఘర్షణను ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. దర్శకుడు సంతోష్ జగర్లపూడి ఆధ్యాత్మిక అంశాలతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేశారు.
సుమంత్ తన పాత్రలో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. పాత్రలోని ఇంటెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ వారాహి మాత పాత్రలో కనిపించనుండగా, సిద్ధు జొన్నలగడ్డ కీలకమైన పాత్రలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. మినాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
టెక్నికల్‌గా ‘మహేంద్రగిరి వారాహి’ భారీ స్థాయిలో కనిపిస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ ఆర్ట్స్ రూపొందించిన సెట్స్, పీరియాడికల్, ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతాప్ ఆర్ కృష్ణా మహేంద్రగిరి ప్రాంతంలోని మిస్టీరియస్ ల్యాండ్‌స్కేప్‌ను, కథలోని కీలక ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్రైలర్‌లోని ఉత్కంఠను మరింత పెంచింది. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ నిర్మాణ విలువలు ట్రైలర్‌లో అద్భుతంగా వున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, భారీ విజువల్స్, ఆధ్యాత్మిక అంశాలు, మిస్టరీతో కూడిన కథనం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. భక్తి, మిస్టరీ, థ్రిల్‌ను కలగలిపిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























