సహ ట్రైలర్ రిలీజ్ 

Sahaa Trailer Released

నిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంజు జీవితంలోని బాల్యం, స్కూల్ డేస్, కాలేజీ, తొలి ప్రేమ, వివాహం.. ఆ తర్వాత చోటుచేసుకునే భావోద్వేగ మలుపులు ఇలా అతడి జీవితంలోని కీలక దశలన్నీ ట్రైలర్‌లో కనిపిస్తాయి. అయితే సంజు జీవితంలోకి సహా అనే అమ్మాయి రావడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఆమె పేరు మాత్రమే కాదు.. గతంలో తన జీవితంలో ఉన్న ఓ వ్యక్తితో ఆమెకు ఉన్న పోలికలు సంజును ఆలోచనలో పడేస్తాయి.

కొన్ని బంధాలు తిరిగి మన జీవితంలోకి రావడం ముందే నిర్ణయించబడిందా? గతాన్ని నిజంగా పూర్తిగా వదిలి ముందుకు వెళ్లగలమా? కాలం గడిచినా కొన్ని భావోద్వేగాలు ఎందుకు మనలోనే మిగిలిపోతాయి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలను ఈ కథ లేవనెత్తుతుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌కే పరిమితం చేయకుండా.. జ్ఞాపకాలు, భావోద్వేగ గాయాలు, అంగీకారం, గతానికి ముగింపు పలికే ప్రయత్నం వంటి అంశాలను కూడా ఈ చిత్రం ప్రజెంట్ చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

కుమార్ కాసారం సంజు పాత్రలో సహజంగా కనిపించారు. బాల్యం నుంచి జీవితంలోని వివిధ దశల వరకు పాత్రలోని భావోద్వేగాలను చక్కగా పలికించారు. శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.

దర్శకుడు నిషాంత్ దోటి కథను సున్నితమైన, సహజమైన ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించారు. కేవలం డ్రామాటిక్ సన్నివేశాలపై ఆధారపడకుండా.. ప్రేక్షకులు తమ జీవితాలతో కనెక్ట్ చేసుకునే భావోద్వేగాలు, పరిస్థితుల ద్వారా కథను ముందుకు తీసుకెళ్లారు.

శేఖర్ చంద్ర అందించిన సంగీతం సినిమాకు నాస్టాల్జిక్ వాతావరణాన్ని మరింత పెంచింది. మెలోడీ, ఎమోషన్‌తో కూడిన సంగీతం ఆకట్టుకుంది. కరుణాకర్ కె. సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణగా నిలవగా, దినేష్ పెద్ది ఎడిటింగ్

మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.