సంబరాల ఏటిగట్టు నుంచి అర్జున్ గా డాలీ ధనంజయ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ 

Dolly Dhananjaya’s Special Poster as Arjun from Sambarala YetiGattu

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘అసుర ఆగమన’ గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది.  

ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ యాక్టర్ డాలీ ధనంజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనంజయ్ పుట్టినరోజు సందర్భంగా అర్జున్ పాత్రలో ఆయన్ని పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది.

‘అర్జున్’గా ధనంజయ్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఆయన పాత్ర కథలో కీలకమైన ప్రభావాన్ని చూపించబోతున్నట్లు పోస్టర్ సూచిస్తోంది. ‘అర్జున్’ పాత్ర తెరపై ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయబోతుంది.

భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో,  భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు.

ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్  పవర్ ఫుల్  పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ, బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ  చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ చిత్రంలో ఒక అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం, దీని పాన్-ఇండియా ఎట్రాక్షన్ ను మరింత పెంచుతోంది. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ కూడా ఈ తారాగణంలో భాగమై, ప్రముఖ పాత్రలలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక బృందం పని చేస్తోంది. వెట్రివేల్ పళనిస్వామి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటర్ నవీన్ విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్,  ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృథ్వీ,  ఈ చిత్రం విజువల్ వండర్ గా వుండబోతోంది.సంబరాల ఏటిగట్టు 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.