మాస్ మహారాజా రవితేజ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన మాస్ ర్యాంపేజ్‌ను షురూ చేసింది. రేపే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. నార్త్ అమెరికా ప్రీ-సేల్స్‌లోనే ఇప్పటికే $250K+ మార్కును దాటేసి ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఇరుముడి’ బుకింగ్స్ అదరగొడుతున్నాయి.బుక్ మై షోలో గంటకు 6వేలకు పైగా టికెట్స్ బుకింగ్ తో ట్రెండింగ్ లో వుంది. రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, విడుదల రోజున మాస్ మహారాజా రవితేజ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి.హిట్ టాక్ వస్తే ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























