వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ‘సెయాన్” ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న ‘అమరన్’ తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో శివకార్తికేయన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది.
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, షాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్‌గా సుప్రీమ్ సుందర్ పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అరుణ్ వెంకటరామూడి రూపొందిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























