పళ్ళబురుసు చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోంది –  సుప్రియ యార్లగడ్డ

We Feel Very Proud to Have Made Pallaburusu says Supriya Yarlagadda

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ: “ఈ కథ మొదటిసారి విన్నప్పుడే సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాను. చాలా స్వీట్ స్టోరీ. ఇలాంటి కథను చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ కొత్త కథలనే వెతుకుతుంది. ఈసారి ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. తాతయ్య ఉండి ఉంటే కచ్చితంగా ‘మంచి పని చేశావు’ అని చెప్పేవారు. కొత్తవాళ్లతో పాటు సీనియర్ యాక్టర్స్ కలిసి చేసిన సినిమా ఇది. ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో చాలా లోతైన సందేశం కూడా ఉంది. ఈ సినిమా చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోంది.”

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.