ఆకట్టుకున్న విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

Vishwanath and Sons Trailer Telugu out now

కోలీవుడ్ వర్సటైల్ సూపర్‌స్టార్ సూర్య , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. “ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది.. ప్రతి కథకు ఒక గుండెచప్పుడు ఉంటుంది” అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన ట్రైలర్ అత్యంత ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, డ్రామా మరియు మెసేజ్ కలగలిపిన విజువల్స్ తో సమృద్ధిగా ఉంది. సూర్య సరికొత్త క్లాసీ అండ్ డిగ్నిఫైడ్ లుక్‌లో కనిపించి అలరిస్తున్నారు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కథానాయికగా తన నటనతో, క్యూట్‌నెస్‌తో ఆకట్టుకోగా, సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కథకు మరింత బలాన్ని చేకూర్చారు.

జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ఈ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.