మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న విడుదల కానుండగా, పాజిటివ్ బజ్ నేపథ్యంలో ఆగస్టు 6నే రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) గ్రాండ్‌గా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా రితిక నాయక్ నటించగా, మరో కీలక పాత్రలో దాక్షా నగార్కర్ కనిపించనున్నారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే పాత్రలో స్టార్ కమెడియన్ సత్య నటించగా, సీనియర్ నటుడు VTV గణేష్, బుల్లిరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.థమన్ ఎస్ సంగీతం అందించగా, యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
నైజాం మరియు ఆంధ్రాలోని ప్రధాన నగరాలు, మేజర్ సెంటర్లలో ఇప్పటికే ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా శరవేగంగా టికెట్లు అమ్ముడవుతున్నాయి.తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక రోజు ముందే వస్తున్న ఈ ప్రీమియర్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటాయో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























