వంద దేవుళ్ళు ఓటీటీ డేట్ లాక్

Vanda Devullu Locks Its OTT Release Date

‘బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబోలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్ళు’ ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకోగా, ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఆంటోనీ, స్వాసిక, లిజోమోల్ జోస్, కరుణాస్, అజయ్ ధిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథాంశం: నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం, భర్త చనిపోయాక పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఒక తల్లి (సెల్వి) కథను ఆవిష్కరిస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఆమెకు ఒక తోడు కావాలనుకున్నప్పుడు సమాజం నుంచి ఎదురైన వ్యతిరేకత, ఆమె పిల్లలే పెద్దలై తల్లికి ఎలా పెళ్లి జరిపారనే పాయింట్‌తో హృద్యంగా తెరకెక్కించారు.

థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ భావోద్వేగాల చిత్రకథను మిస్ అయిన ప్రేక్షకులు ఆగస్టు 7 నుంచి జీ5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌లో చూడవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.