మార్వెల్ సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్టార్ టామ్ హోలాండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో దుమ్మురేపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో తొలిరోజే సుమారు రూ. 73 కోట్ల గ్రాస్ వసూళ్లను (రూ. 60.60 కోట్ల నెట్) రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
గతంలో హాలీవుడ్ చిత్రాల పరంగా ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్’ (రూ. 65 కోట్లు) రికార్డును ‘స్పైడర్ మ్యాన్’ తుడిచిపెట్టేసి, భారతీయ బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్‌గా అవతరించింది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి ఊహించని రేంజ్‌లో ఆక్యుపెన్సీ లభించింది.లాంగ్ వీకెండ్ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























