దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ (జన నాయకుడు) చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్‌ను సృష్టిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకు రూ. 21 కోట్ల మార్కును దాటేసి ఆల్-టైమ్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. మన దేశంలో కంట్రోల్డ్ స్క్రీన్స్ రిలీజ్‌లో కూడా మొదటి రోజే ఏకంగా 4.35 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై రూ. 10.60 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసింది.
కేరళలో బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 18 గంటల్లోనే 83 వేల ప్లస్ టికెట్లు అమ్ముడై రికార్డ్ సృష్టించగా, బెంగళూరులో చాలా చోట్ల ఉదయం ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్లు నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ అయ్యాయి. కొన్ని చోట్ల ఐకానిక్ ప్రీమియర్స్ ధర రూ. 2,500 వరకు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ నిమిషాల్లో క్లియర్ చేశారు.
తమిళనాడులో రూ. 190 ఫిక్స్డ్ ప్రైస్: తమిళనాడులో సీఎం విజయ్ నిర్ణయం మేరకు సామాన్యులకు భారం కాకుండా గరిష్ట టికెట్ ధరను రూ. 190 గానే ఉంచారు. అయినా సరే అక్కడ ఒక్క చెన్నై నగరంలోనే కమలా సినిమాస్ వంటి థియేటర్లలో ఓపెన్ చేసిన నిమిషాల్లోనే 10,000+ టికెట్లు ఖాళీ అయిపోయాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.ఈసినిమాకి అధిక సంఖ్యలో థియేటర్లు దొరికాయి.
ఇక యూకే తో పాటు యుఎస్, గల్ఫ్ దేశాల్లో విజయ్ ఆఖరి ఫేర్‌వెల్ సినిమాను చూసేందుకు ఎన్‌ఆర్‌ఐలు భారీగా ఎగబడుతున్నారు. యూకేలో బుకింగ్స్ ప్రారంభమైన తక్కువ సమయంలోనే రూ. 1 కోటి మార్కును దాటేసింది.
ఇప్పటివరకు ఉన్న గ్రాండ్ ట్రెండ్‌ను చూస్తుంటే, రాబోయే జులై 23న థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ‘జన నాయగన్’ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 120 – 150 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించి ఇండస్ట్రీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























