రికార్డు ధరకు అమ్ముడైన వృషకర్మ నాన్-థియేట్రికల్ హక్కులు

Vrushakarma Non-Theatrical Rights Sold for a Record Price

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ ‘వృషకర్మ’. ఈ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తూ భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులను (శాటిలైట్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్) ప్రముఖ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ 50కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. నాగచైతన్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నాన్-థియేట్రికల్ డీల్‌గా రికార్డు సృష్టించిందని సమాచారం.ఈ డీల్ తో నిర్మాతలు రిలీజ్ కు ముందే సేవ్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. మైథాలజీ, మిస్టరీ, యాక్షన్ కలగలిసిన వినూత్న కాన్సెప్ట్‌తో గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం, ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకులను, ట్రేడ్ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది. బుల్లితెరతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ జోనర్‌కు భారీ డిమాండ్ ఉంటుందనే నమ్మకంతో ‘జీ’ నెట్‌వర్క్ ఇంతటి భారీ ఫ్యాన్సీ రేటును వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నాగచైతన్య సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ‘వృషకర్మ’ చిత్రాన్ని 2026 దసరా పండగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.