శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఇది ఆయన సినిమానే. వెంకటేశ్వర స్వామి పాత్ర లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. అలాంటి గొప్ప పాత్ర ఆయనకు రావడం అదృష్టం. ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. మనమందరం కూడా ఏదో ఒక సమయంలో మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన వాళ్లమే. ఈరోజు ధనవంతులుగా ఉన్న వాళ్లూ ఒకప్పుడు మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపారు. మిడిల్ క్లాస్ వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఆ విషయంలో నాగేశ్వర్ రెడ్డి గారు అద్భుతంగా విజయం సాధించారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడికే చెప్పుకుంటాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్‌లో నటించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గారికి, నిర్మాత చందు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ఈ సినిమా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చేసి చాలా కాలమైంది. ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్ట్‌తో గతంలో నేను కలిసి పనిచేశాను. మళ్లీ వాళ్లందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పాత రోజులు గుర్తుకు తెచ్చింది. రఘుబాబు, సునీల్, వెన్నెల కిషోర్… ఇలా ఎంతో మంది అద్భుతమైన నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. ప్రతి పాత్ర కథకు బలంగా నిలుస్తుంది. ఒక్కో పాత్ర చాలా బాగా ఎలివేట్ అయింది. రత్నబాబు రాసిన డైలాగులు చాలా సరదాగా, సహజంగా ఉంటాయి. అంజి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. లయ గారు కూడా ఈ సినిమాకు చాలా పెద్ద బలం. ‘స్వరాభిషేకం’ తర్వాత మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్లో నటించడం చాలా ఆనందంగా ఉంది. మా జోడీ ఈ కథకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయి ఎంటర్టైనర్లు కొంచెం తగ్గాయి. మంచి వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం మాకు ఉంది. అనిల్ రావిపూడి వరుసగా వినోదాత్మక చిత్రాలు చేసి ఈ జానర్ కి ఎంత ఆదరణ వుందో చూపించారు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కూడా మంచి వినోదాత్మక సినిమానే. జూలై 17న మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్లలో చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























