యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రెండు భారీ హిట్లతో కెరీర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మరియు ట్రేడ్ వర్గాలలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్ రీసెంట్‌గా జరిగిన బిజినెస్ డీల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ , నాన్-థియేట్రికల్ (శాటిలైట్, డిజిటల్, ఆడియో) హక్కులు కలిపి మొత్తంగా ఏకంగా రూ. 35 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాయి. కిరణ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ కావడం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి బిజినెస్ పరంగా ఇంతటి భారీ స్పందన రావడానికి పలు సానుకూల అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా స్వరబ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ గా నిలిచి మ్యూజికల్ హిట్ అవ్వడం సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. దీనికి తోడు ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు గతంలో ‘బేబీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వారు కావడంతో, ఈ ప్రాజెక్ట్ మేకింగ్ మరియు ప్రమోషన్స్‌పై ప్రేక్షకులలో గట్టి నమ్మకం ఏర్పడింది.
ఈ అన్ని ప్లస్ పాయింట్స్ కలిసి ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అపూర్వమైన క్రేజ్‌ను తీసుకువచ్చాయి. కేవలం కంటెంట్‌ను నమ్మి భారీ బడ్జెట్‌తో, అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో అని ప్రేక్షకులు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 24న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























