తమిళ్ మురుగన్ గ్లింప్స్ రిలీజ్

Dhanush–Vetrimaaran Reunite for Tamil Murugan

కోలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న 5వ చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటిస్తూ, చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ఫస్ట్ లుక్ ప్రోమోను విడుదల చేసింది. ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమా అంతా దైవిక, పౌరాణిక లేదా హిస్టారికల్ యుద్ధ నేపథ్యంలో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. గ్లింప్స్‌లో ధనుష్ ఒక పెద్ద సైన్యం ముందు, ఏనుగుపై గంభీరంగా కూర్చుని మురుగన్ స్వామి ఆయుధమైన ‘వేల్’ (ఈటె) పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. తమిళ ప్రజల, తమిళ నేలల శాశ్వత రక్షకుడు, యోధుడు, రాజు, నాయకుడు అంటూ ధనుష్ ఈ గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రముఖ రచయిత అరివుమతి రాసిన పుస్తకం, సంగం సాహిత్యంలో నమోదైన తమిళ మురుగన్ చరిత్ర ఆధారంగా ఈ కథ ఉండబోతోంది.

ఈ పీరియాడిక్ క్లాసిక్ చిత్రానికి ప్రస్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ సంచలనం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ధనుష్ తన స్వంత బ్యానర్ ‘వుండర్‌బార్ ఫిల్మ్స్’ తో పాటు ‘ప్రొడక్షన్ మైల్స్ టు గో’ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కూడా మురుగన్ స్వామి నేపథ్యంలో ఒక సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే సమయంలో ధనుష్-వెట్రిమారన్ కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ప్రకటించడంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్, మిగతా నటీనటుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.